మాస్ కాంబో ఫిక్స్, వెయిటింగ్ లో హరీశ్ శంకర్

హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో వీరసింహారెడ్డి సినిమా రూపొందింది. ఈ సినిమా ఫ్యాన్స్ కు, మాస్ ఆడియెన్స్ కు నచ్చినా, ఓవరాల్ గా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన కొత్త సినిమా చేసేందుకు అంగీకరించారు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ గా లాంఛ్ కానుంది.

ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ గోపీచంద్ వెల్లడించారు. అయితే దర్శకుడు గోపీచంద్ బాలీవుడ్ మూవీ జాట్ కు సీక్వెల్ కూడా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఓకే కావడంతో బాలకృష్ణతో హరీశ్ శంకర్ చేయాల్సిన సినిమా హోల్డ్ లో పడినట్లే అనుకోవాలి. కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బాలకృష్ణ, హరీశ్ శంకర్ సినిమా నిర్మించాల్సిఉంది.