క్రిష్ ను వెంటాడుతున్న ‘వీరమల్లు’

అనుష్క నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఘాటీ. క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని యు.వీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఘాటీ గ్లింప్స్ లో అనుష్క నట విశ్వరూపం చూపించింది. దీంతో ఈ సినిమాలో అనుష్క ఓ రేంజ్ మాస్ అవతార్ లో కనిపించబోతోందని తెలుస్తోంది. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ లో సాగే కథగా చెప్పాడు క్రిష్. అవమానాలు దాటుకుని లెజెండ్ గా మారిన ఓ మహిళ కథ ఈ ఘాటీ. ఈ మూవీని ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు కానీ.. ఇప్పుడు పోస్ట్ పోన్ కానుందని వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రంలో మేల్ లీడ్ గా ఎవరు నటించబోతున్నారు అనే టాక్ ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఎందుకంటే అంతా అనుష్కే అవుతుందనుకున్నారు. కానీ ఈ చిత్రంలో అనుష్కతో పాటు తమిళ్ స్టార్ విక్రమ్ ప్రభు కూడా ఓ క్రూషియల్ రోల్ చేయబోతున్నాడని ప్రకటించారు. ఏప్రిల్ 18న ఘాటి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. అయితే.. వీరమల్లు మార్చి 28 నుంచి ఏప్రిల్ 18కి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. అదే జరిగితే.. వీరమల్లు వస్తే ఘాటీ వాయిదా పడడం ఖాయమని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఎలా చూసినా డైరెక్టర్ క్రిష్ ను వీరమల్లు వెంటాడుతూనే ఉన్నాడని తెలుస్తోంది.