వేదిక “ఫియర్” టీజర్ వచ్చేస్తోంది..!

రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది బ్యూటిఫుల్ హీరోయిన్ వేదిక(Vedika) నటిస్తున్న “ఫియర్”(fear) మూవీ. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారిని ఆకట్టుకునే కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు Dr. హరిత గోగినేని(Dr. Harita gogineni). ఫస్ట్ లుక్ పోస్టర్ సక్సెస్ నేపథ్యంలో ఇదే ఉత్సాహంలో టీజర్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ నెల 20వ తేదీన “ఫియర్” టీజర్(Fear Teaser) రిలీజ్ చేయబోతున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు. “ఫియర్” టీజర్ పై మూవీ లవర్స్ లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది.

“ఫియర్” సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని ఇటు టాలీవుడ్ సర్కిల్స్ ను, అటు ఫిల్మ్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.