విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ వీడీ 14 షూటింగ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా సెట్ వర్క్ ను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్నారు. టాలీవుడ్ ఫేమస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా వీడీ 14ను రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి కథా నేపథ్యంతో ఒక యూనిక్ పాయింట్ తో ఈ సినిమా రూపొందనుంది. సెట్ వర్క్ ప్రారంభమైన సందర్భంగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా “వీడీ 14” సెట్ వర్క్ ప్రారంభించామని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెలిపారు. పూజా కార్యక్రమాల ఫొటోలను ఆయన ఈ పోస్ట్ ద్వారా షేర్ చేశారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంగా వచ్చిన చిత్రాల్లో ఇప్పటిదాకా ఎవరూ తెరకెక్కించని కథాంశంతో “వీడీ 14” ఒక పవర్ ఫుల్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. వీడీ 14 చిత్ర కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.