విజయ్ నుంచి సంక్రాంతి సర్ ప్రైజ్ రెడీ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో చేస్తోన్న మూవీ వీడీ 12. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు.. సంక్రాంతికి సర్ ఫ్రైజ్ ప్లాన్ చేశాడట విజయ్. ఈ మూవీ గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడిన ప్రతిసారి ఫ్యాన్స్ కి హై వస్తోంది. మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. అదే డేట్ కు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది.

సంక్రాంతికి ఈ మూవీ నుంచి ఇచ్చే సర్ ఫ్రైజ్ ఏంటంటే టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా ఈ టీజర్ తో జోష్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నారు. జెర్సీతో తన డైరెక్షన్ టాలెంట్ ఏంటో చూపించిన గౌతం ఈసారి విజయ్ తో మరో అద్భుతమైన కథతో వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపిస్తాడు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరికీ మాస్ ఫీస్ట్ అందించేలా సినిమా ఉంటుందని..ఈ మూవీ రెండు భాగాలుగా వస్తుందని నిర్మాత నాగవంశీ చెప్పాడు.