వరుణ్ పెళ్లి ఫుటేజ్ – ఓటీటీ రైట్స్ ఇవ్వలేదట

హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ పెళ్లి వీడియో రైట్స్ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థకు అమ్మారనే విషయంపై వార్తలు నెట్టింట తిరుగుతున్నాయి. దీనిపై వరుణ్ టీమ్ స్పందించింది. ఏ ఓటీటీతో అలాంటి ఒప్పందమేమీ చేసుకోలేదని, ఈ వార్తల్లో నిజం లేదని తెలిపింది. వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ఇటలీలో జరిగింది.

మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్న ఈ వేడుకకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వరుణ్ కారులో పెళ్లి ఊరేగింపుగా వెళ్తున్న వీడియో, అలాగే వెడ్డింగ్ కు ముందు జరిగిన సంగీత్, ఇతర పార్టీల వీడియో క్లిప్స్ బయటకు వచ్చాయి. వెడ్డింగ్ వీడియోను ఎవరికీ ఇవ్వలేదని వరుణ్ టీమ్ తెలిపింది. బాలీవుడ్ లో ఇటీవల సెలబ్రిటీస్ పెళ్లిళ్లు ఓటీటీలకు అమ్ముతున్నారు. నయనతార పెళ్లిని డాక్యుమెంటరీగా చిత్రీకరించారు.