వరుణ్ తేజ్ హారర్ కామెడీ మూవీ మొదలైంది

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి వీటీ 15 అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ఫస్ట్ ఇండో కొరియన్ హారర్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కనుంది. కామెడీ ఎంటర్ టైనర్స్ చేయడంలో పేరున్న దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వరుణ్ తేజ్ సరసన యంగ్ హీరోయిన్ రితికా నాయక్ నటిస్తోంది. ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్న మేకర్స్ తెలిపారు. వరుణ్ తేజ్ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ తన కెరీర్ లో ఓ హారర్ కామెడీ మూవీ చేస్తున్నారు.