మెగా హీరో వరుణ్ తేజ్ కెన్యాలో టూర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కెన్యాలో ఆయన పర్యటిస్తున్నారు. తన టూర్ ఫొటోలను ఇన్ స్టా ద్వారా షేర్ చేశారు వరుణ్. అక్కడి ఫారెస్ట్ ఏరియాలో వరుణ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక టూర్ లో వరుణ్ మదర్ తో పాటు ఫాదర్ నాగబాబు, సిస్టర్ నిహారిక ఉన్నారు.
త్వరలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పెళ్లికి సిద్ధమవుతున్నారు వరుణ్. ఇటీవల ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. పెళ్లికి ఇటలీ డెస్టినేషన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇటలీలో జరిగే వరుణ్, లావణ్య పెళ్లికి మొత్తం మెగా కుటుంబం మూడు రోజుల పాటు వెళ్లనుంది. పెళ్లికి ముందు ఫ్యామిలీతో వరుణ్ టూర్ వెళ్లాలని భావించిన వరుణ్ ఈ వెకేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు వరుణ్ తేజ్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాబట్టలేదు. ఇక ప్రస్తుతం ఆయన తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా వరుణ్ కనిపించబోతున్నారు.