హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వారి వివాహం జరగనుంది. వరుణ్, లావణ్య నిశ్చితార్థం జరిగి చాలా రోజులవుతున్నా…పెళ్లి డేట్ పై క్లారిటీ రాలేదు. ఇక ప్రస్తుతం వీరి వివాహం గురించి ఓ అప్ డేట్ తెలుస్తోంది.
వరుణ్, లావణ్య నవంబర్ 1న పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ రోజున వారి వివాహానికి తేదీని నిర్ణయించిన్లు సమాచారం. డెస్టినేషన్ వెడ్డింగ్ గా వీరి వివాహ వేడుక జరగనుంది. ఇటలీలోని ఓ అందమైన ప్రదేశంలో వరుణ్, లావణ్య పెళ్లి జరగనుందట. ఈ పెళ్లికి మొత్తం మెగా ఫ్యామిలీ సభ్యులంతా హాజరుకాబోతున్నారు. మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలను నిర్వహిస్తారని తెలుస్తోంది.
వరుణ్, లావణ్య ఇందుకు తగినట్లు తమ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటున్నారట. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవధారి అర్జున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్వీసీసీ సంస్థ నిర్మాణంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు గాండీవధారి అర్జున సినిమాను రూపొందించారు.