చిరును రెచ్చగొడుతున్న వర్మ

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళాశంకర్. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన భోళాశంకర్ ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేదు. రీమేక్ చేయడమే చిరు చేసిన పెద్ద తప్పు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అయితే.. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో.. ఆరోగ్యం అక్కడ ఉంది అన్నట్టుగా.. వివాదం ఎక్కడ ఉందో నేను అక్కడ ఉంటాను అన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అయిపోతుంటారు. ఇక భోళాశంకర్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తనదైన స్టైల్ లో భోళాశంకర్ పై విమర్శలు చేశారు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

ఇంతకీ వర్మ ఏమన్నారంటే.. వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో, ప్రూవ్ చెయ్యటానికి తీసినట్టుంది బి ఎస్ అని రాసుకొచ్చారు. తద్వారా భోళాశంకర్ సినిమా ఆడలేదనుకుంటే కనుక అందుకు దర్శకుడు కారణమైతే, వాల్తేరు వీరయ్య ఆడిన క్రెడిట్ దర్శకుడిదే అనే అభిప్రాయం వచ్చేలా ట్వీట్ చేశారు అని వార్తలు వస్తున్నాయి. అలాగే వాల్తేరు వీరయ్య చిరంజీవి వలన ఆడలేదు.. రవితేజ వలన ఆడిందని చెప్పడం కోసం ఈ ట్వీట్ వేశాడని కూడా టాక్ వినిపిస్తోంది. మొత్తానికి భోళాశంకర్ కి నెగిటివ్ టాక్ రావడంతో వర్మ ఈవిధంగా చిరంజీవిని రెచ్చగొడుతున్నాడు. మరి.. చిరు స్పందిస్తారేమో చూడాలి.