కొత్త సినిమా కన్ఫర్మ్ చేయని వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ అంటూ జోనర్ మార్చి సినిమాలు చేశాడు కానీ.. ఆ సినిమాలు సక్సెస్ అందుకోలేకపోయాడు. మరో మంచి మూవీతో కమ్ బ్యాక్ ఇవ్వాలని వైష్ణవ్ తేజ్ భావిస్తున్నా..ఆయనకు సరైన కథ దొరకడం లేదని టాక్ వినిపిస్తోంది. చాలా కొత్త కథలు వింటున్నాడు కానీ.. ఏ కథ కూడా నచ్చడం లేదట. అందుకే కొత్త సినిమాను ప్రకటించలేదని అంటున్నారు.

కొత్త దర్శకులే కాదు.. సక్సెస్ లో ఉన్న డైరెక్టర్స్ చెప్పిన కథలు కూడా వైష్ణవ్ తేజ్ కు నచ్చడం లేదట. అయితే.. ఎంత ఆలస్యం అయినా ఫరవాలేదు.. హిట్ సినిమా చేయాలనే పట్టుదలతో వైష్ణవ్ తేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత స్పీడుగా నాలుగు సినిమాలు చేసిన వైష్ణవ్ తేజ్ తదుపరి చిత్రం చేయడం కోసం గ్యాప్ తీసుకున్నాడు. ఏ కథ చెప్పినా నచ్చడం లేదని నో చెబుతుండడం వల్ల గ్యాప్ బాగా వచ్చేస్తోందని..త్వరలో సినిమా స్టార్ట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వైష్ణవ్ తేజ్ సన్నిహితుల్లో వ్యక్తమవుతోంది.