అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. వీరి సినిమా రిలీజ్ ఎప్పుడనే విషయంలో సోషల్ మీడియాలో నెక్ట్స్ ఇయర్ డిసెంబర్ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. 2026 డిసెంబర్ లో ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మూవీ టీమ్.
ప్రీ ప్రొడక్షన్ విషయంలో చాలా క్లారిటీగా ఉండే దర్శకుడు అట్లీ, షూటింగ్ కూడా స్పీడ్ గా చేసేస్తుంటాడు. షారుఖ్ ఖాన్ తో జవాన్ ను ఇలాగే ఫాస్ట్ గా తెరకెక్కించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా కూడా ఏడాది టైమ్ లో కంప్లీట్ చేసి ప్రమోషన్ తో సహా నెక్ట్స్ ఇయర్ డిసెంబర్ కు రిలీజ్ కు తీసుకొస్తారని కాన్ఫిడెంట్ గా ఉన్నారట టీమ్. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్, హై క్వాలిటీ మేకింగ్ తో ఈ సినిమా స్క్రీన్స్ మీదకు రానుంది.