హీరో రామ్ కొత్త సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ డైరెక్టర్ మహేష్‌బాబు పి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే.. ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. చిత్రం కోసం ఆంధ్రా కింగ్ తాలుకా అనే పేరు పరిశీలనలో వుందని ప్రచారం అయితే జరుగుతోంది. గత కొంతకాలంగా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన రామ్ ఈసారి తనకు బాగా కలిసొచ్చిన క్లాస్ మూవీ.. యాక్షన్ ఉండే రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు.
ఇటీవల రాజమండ్రిలో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. త్వరలోనే హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ఇక ఈ సినిమా కథ గురించి ప్రస్తుతానికి చిత్ర యూనిట్ ఎలాంటి క్లూ ఇవ్వలేదు కానీ.. ఓ కథ ప్రచారంలోకి వచ్చింది. ఓ మారుమూల ప్రాంతం కరెంటుకు నోచుకోలేదట. ఆ ప్రాంతానికి కరెంట్ తీసుకురావడానికి హీరో ఏం చేశాడన్నది కథ అని సమాచారం. మాస్, యాక్షన్, హీరోయిజం, వీటి మధ్యలో ఓ లవ్ స్టోరీతో పాటు మంచి మెసేజ్ కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. ఇందులో రామ్ కు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తారని సమాచారం.