సినిమాకు పునాది లాంటిది స్క్రిప్ట్. టాలీవుడ్ లో వినూత్నమైన కథలు రావాలనే అంతా కోరుకుంటారు. అయితే టాలెంటెడ్ రైటర్స్ కు వాళ్ల ప్రతిభ చూపించే వేదికలు దొరకవు. ఈ గ్యాప్ ఫిల్ చేసేందుకు ముందుకొచ్చింది ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్. న్యూ టాలెంటెడ్ రైటర్స్ తమ స్క్రిప్ట్ లు తమ సైట్ లో పోస్ట్ చేసే అవకాశం కల్పిస్తోంది ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్. ఈ సైట్ ను ప్రారంభించి ఈ ప్రయత్నానికి మద్ధతుగా నిలిచారు రెబెల్ స్టార్ ప్రభాస్. సోషల్ మీడియా ద్వారా ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ను ఆయన ప్రారంభించి తన విశెస్ తెలియజేశారు.
రచయితలు తమ స్క్రిప్ట్ ను 250 పదాల నిడివిలో ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసుకోవచ్చు. వీక్షకులు చదివి తమ రేటింగ్స్ ఇచ్చేలా సైట్ రూపొందించారు. అత్యధిక రేటింగ్ పొందిన స్క్రిప్ట్ లను టాప్ ప్లేస్ లో ఉంచబోతున్నారు. ఈ సైట్ ద్వారా రైటర్, అసిస్టెంట్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాలకు పనిచేసే అవకాశాలు పొందవచ్చు.