దేవర కోసం సునామీ సీక్వెన్స్ నిజమేనా..?

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర. ఈ చిత్రాన్ని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ఈ మూవీలోని కీలకమైన ఎపిసోడ్ ఒకటి ఉందట. అది సునామీ సీక్వెన్స్ అని.. ఈ సీక్వెన్స్ కోసం భారీ స్మిమ్మింగ్ ఫుల్ సెట్ వేస్తున్నారట. సముద్రంలోని భయానక వాతావరణాన్ని కొరటాల బాగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారట. ఇంకా చెప్పాలంటే.. ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా.. వావ్ అనిపించేలా.. ఈ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారట.

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా అతిలోక సుందరి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంటే.. విలన్ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవర పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. జనతా గ్యారేజ్ కాంబోలో వస్తున్న దేవర ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే టాక్ బలంగా ఉంది. ఏప్రిల్ 5న ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కానుంది.