వరుణ్ తేజ్ రీసెంట్ మూవీ గాండీవధారి అర్జున బాక్సాఫీస్ వద్ద బౌన్స్ బ్యాక్ అవడంతో ఈ మెగా హీరో స్టోరీ సెలెక్షన్ మీద విమర్శలు మొదలయ్యాయి. ప్రయోగాత్మక సినిమాలు చేయడం వల్లే వరుణ్ కు సక్సెస్ రావడం లేదంటూ ట్రోల్స్ వస్తున్నాయి. కొన్నాళ్ల పాటు ఈ ఎక్స్ పర్ మెంట్ మూవీస్ ఆపితే మంచిదనే సూచనలు వినిపిస్తున్నాయి. అభిమానులు కూడా వరుణ్ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ మూవీస్ చేయాలని సజెస్ట్ చేస్తున్నారు.
వరుణ్ తేజ్ గత సినిమా గని కూడా ఫ్లాప్ అయ్యింది. ఎఫ్ 3 కూడా ఆశించిన ఫలితం రాబట్టలేదు. ఈ సినిమాలో వరుణ్ కు వచ్చిన నెగిటివిటీ తక్కువే గానీ గత రెండు సినిమాలు గని, గాండీవధారి అర్జున ఫ్లాప్స్ మాత్రం పూర్తిగా వరుణ్ ఖాతాలోనే పడ్డాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఆపరేషన్ వాలెంటైన్ కూడా తెలుగు నేటివిటీకి అంతగా సూటయ్యేది కాదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎయిర్ ఫోర్స్ పైలట్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నారు.
ఇక పలాస దర్శకుడు కరుణ కుమార్ తో వరుణ్ తేజ్ చేస్తున్న మట్కా సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా వర్కవుట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కుతున్న మట్కా మీదే వరుణ్ కూడా హోప్స్ పెట్టుకున్నాడు.