గుంటూరు కారం సినిమా ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా మళ్లీ ఫామ్ కోల్పోయాడు. ఆయన ఓ సూపర్ హిట్ తో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దర్శకుడిగా ఫ్లాప్ అయినా నిర్మాతగా టిల్లు స్క్వేర్, లక్కీ భాస్కర్ వంటి మూవీస్ తో తన సక్సెస్ కొనసాగిస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ భారీ మైథలాజికల్ మూవీకి గత కొద్ది రోజులుగా సన్నాహాలు జరుగుతున్నాయి.
తాజాగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ నిర్మించే ఈ సినిమాలో కొన్ని కీలక పాత్రల కోసం నటీనటులను సెలెక్ట్ చేస్తున్నాడట త్రివిక్రమ్. అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డ్ స్థాయి హిట్ కావడం, త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేసిన మూవీస్ కు మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో ఈ కొత్త మూవీపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.