రెండు భాగాలుగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ?

టూ పార్ట్ మూవీస్ ఇప్పుడొక పాన్ ఇండియా ట్రెండ్ అయ్యాయి. బాహుబలి, కేజీఎఫ్ ఇలాగే ఇండస్ట్రీ హిట్స్ కొట్టాక…మనం కూడా ఇలా ట్రై చేయొచ్చు కదా అనే ఆలోచన అందరిలో మొదలైంది. ఎన్టీఆర్ దేవర కూడా టు పార్ట్ మూవీ అంటూ అనౌన్స్ చేశారు. ఇదే దారిలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఆ మధ్య అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో నాలుగో మూవీ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా వర్క్స్ ప్రారంభమవుతాయి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని టీమ్ భావిస్తున్నారట.

ఇదొక కొత్త తరహా కథ అని, అందర్నీ సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందని రీసెంట్ గా నిర్మాత నాగవంశీ తెలిపారు. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో ఉంది, మరోవైపు త్రివిక్రమ్ మహేశ్ తో తాను రూపొందిస్తున్న గుంటూరుకారం సినిమా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.