స్టార్ హీరోల సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తోంది త్రిష. సౌత్ లో లాంగ్ కెరీర్ కొనసాగిస్తున్న త్రిషకు ఇప్పటికీ మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి. పొన్నియన్ సెల్వన్ రెండు భాగాల సూపర్ హిట్ తో త్రిష మళ్లీ ఫేమ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె విజయ్ సరసన లియోలో నటిస్తోంది. ఈ భారీ సినిమాతో పాటు త్రిష నటిస్తున్న మరో ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ సినీ ప్రియుల్ని ఆకర్షిస్తోంది.
ఆ సినిమానే ది రోడ్. రివేంజ్ డ్రామా కథతో కొత్త దర్శకుడు అరుణ్ వసీగరన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రియల్ లైఫ్ ఘటనల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష ప్రతీకారం తీర్చుకునే క్యారెక్టర్ లో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి.
ది రోడ్ మూవీ అక్టోబర్ 6న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మరోవైపు త్రిషకు దక్కుతున్న ఆఫర్స్ లో మణిరత్నం, కమల్ హాసన్ మూవీ కూడా చేరినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించనుంది.