పవర్ స్టార్ ఫ్యాన్స్ కు రేపు ట్రిపుల్ బొనాంజా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు రేపు ట్రిపుల్ బొనాంజా రాబోతోంది. రేపు పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు నుంచి అప్ డేట్స్ రాబోతున్నాయి. ఈ మూడింటిలో ఒకటి ఓజీ నుంచి గ్లింప్స్ విడుదలవుతుండగా..మిగతా రెండు చిత్రాల నుంచి కొత్త పోస్టర్స్ మన ముందుకు తెస్తున్నారు.

ఓజీ సినిమా నుంచి ఉదయం 10.35 నిమిషాలకు గ్లింప్స్ రిలీజ్ అ‌వుతుండటగా…మధ్యాహ్నం 12.17 నిమిషాలకు హరి హర వీరమల్లు నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కూడా బర్త్ డే పోస్టర్ విడుదల చేస్తారు. ఇలా మూడు సినిమాల నుంచి అప్ డేట్స్ వస్తుండటంతో పవన్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో పవన్ బర్త్ డే సందడి ఇప్పటికే మొదలైంది.

సినిమా ఇండస్ట్రీ నుంచే కాక రాజకీయ వర్గాల నుంచి కూడా పవన్ కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే చెబుతూ పోస్టర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.