ఆగస్టు 2న రిలీజ్ కు వస్తున్న విజయ్ ఆంటోనీ “తుఫాన్”

హీరో విజయ్ ఆంటోనీ (Vijay antony) నటిస్తున్న “తుఫాన్” (toofan) మూవీ రిలీజ్ డేట్ ను ఈరోజు అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 2న ఈ సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా “తుఫాన్” సినిమాను రూపొందించారు దర్శకుడు విజయ్ మిల్టన్ (Vijay milton).

ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ ఆంటోనీ సూపర్ హిట్ మూవీ బిచ్చగాడును గుర్తుచేసింది “తుఫాన్” సినిమా. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. మేఘా ఆకాష్ (Megha akash) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.