టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు కలిసి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కాబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం, ఇండస్ట్రీ మధ్య తలెత్తిన విభేదాల విషయంలో బేదాభిప్రాయాలను తొలగించుకునే ప్రయత్నం ఈ భేటీలో జరుగుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈరోజు కిమ్స్ ఆస్పత్రికి అల్లు అరవింద్ తో కలిసి దిల్ రాజు వెళ్లారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శ్రీతేజ్ కుటుంబానికి మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్, రవిశంకర్.. దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ తరపున మొత్తం రూ.2 కోట్లు ఇస్తున్నామని ఈ సందర్భంగా అల్లు అరవింద్ తెలిపారు. ఈ మొత్తంలో అల్లు అర్జున్ కోటి రూపాయలు.. మైత్రీ నిర్మాతలు రూ.50 లక్షలు, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు ఇచ్చారు.