ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరుగుతోంది. టాలీవుడ్ నుంచి నిర్మాత, ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు ఈ భేటీలో పాల్గొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
టాలీవుడ్ ప్రముఖుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, దిల్ రాజు, మురళీ మోహన్, శ్యాం ప్రసాద్ రెడ్డి, శివ బాలాజీ, బోయపాటి శ్రీను, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, కిరణ్ అబ్బవరం, ఎలమంచిలి రవి, బలగం వేణు తదితరులు ఉన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సినిమా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం సినీ పెద్దలకు సూచించనుంది. అలాగే గద్దర్ అవార్డ్స్, టికెట్ రేట్ల పెంపు, బెన్ ఫిట్ షోస్ తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి.