సెల్ బే స్టోర్ లో సందడి చేసిన సినీ నటి వర్షిణి

గచ్చిబౌలి సెల్ బే (Cell bay) స్టోర్ లో సందడి చేసింది సినీ నటి, యాంకర్ వర్షిణి (Anchor varshini). ఈ షో రూమ్ లో షావోమీ సరికొత్త 5G హ్యాండ్సెట్ షావోమీ 14 సీవీ’ (Xiaomi 14CV) ను లాంఛ్ చేసింది. ఈ సందర్బంగా నటి వర్షిణి మాట్లాడుతూ – తెలంగాణ లో అత్యంత నమ్మకమైన సంస్థ సెల్ బే వారి షోరూమ్ లో షావోమీ 14 సీవీ’ లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది. ది బెస్ట్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అందిస్తున్న సెల్ బే మేనేజ్ మెంట్ కు విశెస్ చెబుతున్నా. అని చెప్పింది.

సెల్ బే ఫౌండర్, ఎండీ శ్రీ సోమా నాగరాజు మాట్లాడుతూ – కస్టమర్స్ కు లేటెస్ట్ ప్రాడక్ట్స్ అందించమే మా లక్ష్యం. ఆ క్రమంలోనే ఈ రోజు ‘షావోమీ 14 సీవీ’ లాంచ్ చేశాం. అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కునాల్ అగర్వాల్ (సీనియర్ డైరెక్టర్, సేల్స్ షావోమీ ఇండియా డిప్యూటీ హెడ్), శ్రీ మల్లికార్జున రావు (డైరెక్టర్ ఛానల్ సేల్స్, షావోమీ ఇండియా), మిస్టర్ సాజు రత్నం (హెడ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్ ఛానల్, షావోమీ ఇండియా), మిస్టర్ సయ్యద్ అన్వర్, జోనల్ హెడ్( AP&TS) షావోమీ ఇండియా , Mr. మొహమ్మద్ ఇఫ్తేకర్(ఆర్గనైజ్డ్ ట్రేడ్ కోసం నేషనల్ రిటైల్ మార్కెటింగ్ మేనేజర్) పాల్గొన్నారు.