“ఎస్ఎస్ఎంబీ 29” టైటిల్ ఫిక్స్

టాలీవుడ్ నుంచి వస్తున్న మరో బిగ్ బడ్జెట్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29(SSMB 29). మహేశ్ బాబు(Mahesh babu) హీరోగా దర్శకుడు రాజమౌళి(Rajamouli) రూపొందిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. త్వరలోనే ఈ సినిమాను లాంఛనంగా అనౌన్స్ చేయబోతున్నారు. ఎస్ఎస్ఎంబీ 29 సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు గరుడ(Garuda) అనే టైటిల్ ఫిక్స్ చేశారనేది ఈ టాక్ సారాంశం.

గతంలో ఈ సినిమాకు మహారాజ అనే టైటిల్ ప్రచారంలోకి రాగా..అది విజయ్ సేతుపతి తమిళ హిట్ సినిమాకు పెట్టారు కాబట్టి ఆ ప్రపోజల్ విరమించుకున్నారట. ఇక ఇప్పుడు గరుడ అనే టైటిల్ కే రాజమౌళి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికన్ అడ్వెంచర్ కథతో సాగే ఈ సినిమాను సౌత్ ఆఫ్రికాలో షూట్ చేయబోతున్నారు. సౌత్ ఆఫ్రికాలో లొకేషన్స్ రెక్కీ చేస్తున్నారట. త్వరలో ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ గా సెట్స్ మీదకు వెళ్లనుంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ లో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.