“పెద్ది” ఫస్ట్ షాట్ కు ముహూర్తం ఫిక్స్

రామ్ చరణ్‌ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తోన్న మూవీ పెద్ది. ఇది భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఇందులో చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ లో రామ్ చరణ్‌ మాస్ మేకోవర్ లో సర్ ప్రైజింగ్ గా కనిపించడంతో పెద్ది సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ఈ రెస్పాన్స్ తో హ్యాపీగా ఫీలైన రామ్ చరణ్‌, ఉపాసన దంపతులు బుచ్చిబాబుకు సర్ ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చారు. రామ్ చరణ్‌ పుట్టినరోజుకు గ్లింప్స్ కూడా రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. రిలీజ్ చేయలేదు.

ఇప్పుడు పెద్ది గ్లింప్స్ రిలీజ్ కి ముహుర్తం పిక్స్ చేశారు. రేపు శ్రీరామ నవమి సందర్భంగా పెద్ది ఫస్ట్ షాట్‌ వీడియోని రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ స్పోర్ట్స్ పర్సన్ గా కనిపిస్తాడు. బ్యాట్ తో ఫస్ట్ షాట్ కొట్టే వీడియోని విడుదల చెయ్యబోతున్నారని టాక్. అందుకే ఈ వీడియోకి ఫస్ట్ షాట్ అనే పేరు పెట్టారు అని అంటున్నారు. ఆ ఫస్ట్ షాట్ వీడియోలో ఏం ఉండబోతుందో రేపు శ్రీరామనవమి నాడు తెలుస్తుంది. ఈ వీడియో ఆదివారం ఉదయం 11:45 గంటలకు విడుదల కానుంది. ఈ ఫస్ట్ షాట్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు ఇతర పాత్రల్లో కనిపిస్తారు. మార్చి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.