టిల్లు స్వ్కేర్ మరింత ఆలస్యం కానుందా..?

డీజే టిల్లు సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో హీరోగా నటించిన సిద్దు జొన్నలగడ్డ అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించాడు కానీ.. ఆశించినంతగా క్రేజ్ రాలేదు. ఈ ఒక్క సినిమాతోనే యూత్ కి బాగా దగ్గరయ్యాడు. సిద్దు జొన్నలగడ్డ కన్నా.. టిల్లుగానే బాగా పాపులర్ అయ్యాడు. ఈ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్వ్కేర్ చేస్తున్నాడు. ఇందులో సిద్దుకు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. యూత్ అయితే.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తుంది.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. రామ్ స్కంద మూవీ అక్టోబర్ నుంచి సెప్టెంబర్ కి వాయిదా వేయడంతో టిల్లు మూవీ అక్టోబర్ లో విడుదల చేయాలి అనుకున్నారు. ఇప్పుడు అక్టోబర్ లో కూడా టిట్లు స్వ్కేర్ రావడం లేదని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. ఈ చిత్రానికి మాలిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.