నేషనల్ మల్టీప్లెక్స్ ఛైన్స్ లో షారుఖ్ ఖాన్ కొత్త సినిమా జవాన్ క్రేజ్ మామూలుగా లేదు. ఈ సినిమాకు ఫస్ట్ డేకు రికార్డు స్థాయిలో టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. జవాన్ సినిమా డే వన్ థియేటర్ లో చూసేందుకు దాదాపు 2.50 లక్షల టికెట్స్ అమ్ముడయ్యాయి. ఇది జవాన్ సినిమా మీదున్న క్రేజ్ ను చూపిస్తోంది.
షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ఈ నెల 7వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా లాంగ్వేజెస్ అయిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, దీపిక, విజయ్ సేతుపతి కీ రోల్స్ చేశారు.
ఇప్పటిదాకా ఫెయిల్యూర్ లేని తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తుండటం…పఠాన్ రికార్డ్ హిట్ తర్వాత షారుఖ్ నటిస్తున్న సినిమా కావడంతో జవాన్ మీద విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. ట్రైలర్ తో సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. జవాన్ వరల్డ్ లార్జర్ దేన్ లైఫ్ ఉంటుందని ట్రైలర్ చూపించింది.