డైరెక్టర్ శంకర్ తెలుగులో ముగ్గురు స్టార్ హీరోలతో సినిమా చేయాలని ట్రై చేస్తే.. కుదరలేదట. శంకర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అనుకున్నారట. మంచి కథ ఉంటే చెప్పండి.. సినిమా చేద్దామని చిరంజీవి కూడా స్వయంగా శంకర్ ని అడగడం జరిగింది. అయితే.. చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నారట.. ప్రయత్నాలు చేశారట కానీ.. కుదరలేదట. ఆతర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రీ ఇడియట్స్ రీమేక్ చేయాలి అనుకున్నారు కాకపోతే.. మహేష్ బాబు రీమేక్స్ చేయనని.. స్ట్రైయిట్ మూవీ చేస్తానని చెప్పారట. అలా మహేష్ తో శంకర్ మూవీ సెట్ కాలేదు.
చిరంజీవితో కుదరలేదు.. మహేష్ తో కుదరలేదు.. మరి.. శంకర్ చేయాలి అనుకున్న మూడో హీరో ఎవరంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. కరోనా టైమ్ లో ప్రభాస్ ను కలిసి శంకర్ కథ చెప్పారట కానీ.. ఇక్కడ కూడా కొన్ని కారణాల వలన సెట్ కాలేదు. అయితే.. శంకర్ కథ చెప్పిన వెంటనే నచ్చడంతో చరణ్ ఓకే చెప్పారు. దీంతో గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఆలస్యం అవ్వడం.. శంకర్ ఫామ్ లో లేకపోవడంతో గేమ్ ఛేంజర్ పై అంతగా బజ్ లేదు. అయితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ యుఎస్ లో చేసిన తర్వాత నుంచి సీన్ మారింది. సుకుమార్ ఇచ్చిన రివ్యూ అంచనాలు పెంచేసింది. ఇక్కడ అంతా సక్సెస్ చుట్టూ తిరుగుతుంది. సక్సెస్ ఉంటే.. ఏ హీరో అయినా సినిమా చేయడానికి రెడీ అంటారు. అదే సక్సెస్ లేకపోతే.. ఇంతకు ముందు ఎంత పెద్ద హిట్స్ ఇచ్చినా నో చెబుతారు.