ముగ్గురు హీరోయిన్స్ తో కార్తి

హీరో కార్తి(Hero kaarthi) ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి నటిస్తున్నాడు. ఆయన సర్దార్ 2 సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ మాళవిక మోహనన్(Malvika mohanan), అషికా రంగనాథ్ (Ashika ranganath) హీరోయిన్స్ గా కన్ఫర్మ్ కాగా..ఇప్పుడు మూడో హీరోయిన్ రజిషా విజయన్ (Rajitha vijayan) మూవీలో జాయిన్ అయ్యింది. రజిషా విజయన్ తెలుగులో రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించింది.

ఇప్పుడీ మూవీ కూడా ఆమెకు మంచి ఆఫర్ అనుకోవచ్చు. ప్రస్తుతం సర్దార్ 2 షూటింగ్ జరుగుతోంది. పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఎస్ జే సూర్య విలన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సర్దార్ సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో సర్దార్ 2 పై అంచనాలు బాగానే ఉన్నాయి.