పెద్ద సినిమాల టైమ్ లో చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకవు. అందుకే అవి టైమ్ చూసి వస్తుంటాయి. ఇలా దసరా సీజన్ కు పెద్ద సినిమాలు రిలీజ్ కు వస్తుండటంతో చిన్న సినిమాలన్నీ ఈ వారం విడుదలకు ప్లాన్ చేసుకున్నాయి. అలా అరడజను సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో ఈ ఫ్రైడే టాలీవుడ్ బాక్సాఫీస్ చిన్న సినిమాలదే కాబోతోంది.
ఈ నెల 6న థియేటర్స్ లోకి సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన మామా మశ్చీంద్ర, కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్, స్వాతి, నవీన్ చంద్ర కలిసి నటించిన మంత్ ఆఫ్ మధు, మురళీధరన్ బయోపిక్ 800, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ తో సితార సంస్థ నిర్మించిన మ్యాడ్, సిద్ధార్థ్ డబ్బింగ్ మూవీ చిన్నా రిలీజ్ కాబోతున్నాయి.
వీటిలో రూల్స్ రంజన్ ట్రైలర్ బాగుంది కాబట్టి ఆ మూవీ మీద ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సుధీర్ బాబు మామా మశ్చీంద్ర కు అంతంత మాత్రమే క్రేజ్ ఉంది. ఇక ఇది కాకుండా మిగతా సినిమాలన్నింటికీ టాక్ బాగుంటేనే థియేటర్స్ నిండుతాయి. వీటికి ఓపెనింగ్స్ రావడమూ కష్టమే. దీంతో ఈవారం టాలీవుడ్ బాక్సాఫీస్ డల్ గానే ఉండనుంది.