తమిళ సినిమాతో ఎన్టీఆర్ కు చిక్కులు

తమిళ సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ప్రదీప్ రంగనాథన్, అనుపమా పరమేశ్వరన్, కయదు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంటోంది. ఈ సినిమా పేరు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అయినా..డ్రాగన్ అనే అంతా పిలుస్తున్నారు. ఈ టైటిల్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కొత్త సినిమాకు చిక్కులు తెచ్చిపెడుతోంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ బాగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో తమిళ సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ హిట్ అయి ప్రేక్షకులకు బాగా రీచ్ అవడం ఎన్టీఆర్ సినిమాకు ఇబ్బందులు తీసుకొస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యాక కోల్ కతా లో షూటింగ్ చేయబోతున్నారు టీమ్. ఎన్టీఆర్ బర్త్ డే అయిన మే 20 ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారనేది ఆసక్తికరంగా మారింది.