ఓటీటీలోకి “మిస్టర్ బచ్చన్”, ఎప్పుడంటే ?

రవితేజ(Raviteja) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr bachan) ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్(Netflix) లో వినాయక చవితి రోజున స్ట్రీమింగ్ కు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 7న వినాయక చవితి. ఈ రోజు నుంచే నెట్ ఫ్లిక్స్ మిస్టర్ బచ్చన్ స్ట్రీమింగ్ చేయాలని భావిస్తోందట. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిఉంది.

రవితేజతో దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People media factory) రూపొందించింది. ఈ సినిమా బాలీవుడ్ మూవీ ది రైడ్ కు తెలుగు రీమేక్ గా రూపొందింది. బాలీవుడ్ లో హిట్ మూవీ ఇక్కడ రీమేక్ లో మాత్రం ఫ్లాప్ అయ్యింది. హరీశ్ శంకర్ ఫస్టాఫ్ ను కామెడీగా, సెకండాఫ్ ను పూర్తి యాక్షన్ తో నింపేసి ఈ రెండు మేజర్ ఎలిమెంట్స్ ను బ్యాలెన్స్ చేయలేకపోయాడు. మిస్టర్ బచ్చన్ ఓటీటీలోనైనా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందా అనేది చూడాలి.