“RC 16” రిలీజ్ ఎప్పుడంటే ?

రామ్ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ సీ 16 అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకుననారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్‌ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఆర్ సీ 16 సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ మూవీ టైటిల్ పెద్ది అని ప్రచారంలో ఉంది. అయితే.. ఈ నెల 27న చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఇందులో ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా కన్ ఫర్మ్ అయ్యిందట. గేమ్ ఛేంజర్ నిరాశపరచడంతో ఈ ఇయర్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ.. అలా చేయడం లేదట. నెక్ట్స్ ఇయర్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందుగా 2026లో మార్చి 26న రిలీజ్ చేయనున్నారని తెలిసింది. ఈ రిలీజ్ డేట్ ను బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్న గ్లింప్స్ లో తెలియచేస్తారని ఇన్ సైడ్ న్యూస్. ఈ చిత్రంలో చరణ్‌ ఆట కూలీగా నటిస్తున్నాడు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.