ఓజీ వాయిదాకి అసలు కారణం ఇదే.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్టర్. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ ఈ సినిమాకి ఎక్కువ డేట్స్ ఇవ్వడంతో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓజీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరిగింది. ఇప్పటి వరకు యాభై శాతంకు పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ను అక్టోబర్ కు పూర్తి చేసి.. డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. డిసెంబర్ లో ఓజీ థియేటర్లోకి వస్తుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే.. ఇప్పుడు ఓజీ డిసెంబర్ లో రావడం లేదు. ఏప్రిల్ లేదా జూన్ లో థియేటర్లోకి రానుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ బాగా డల్ అయ్యారు. ఎందుకు ఓజీ మూవీని వాయిదా వేశారనేది ఆసక్తిగా మారింది. ఆరా తీస్తే.. తెలిసింది ఏంటంటే.. భారీ అంచనాలతో వచ్చిన బ్రో మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. నెక్ట్స్ మూవీ ఓజీ. అయితే.. బ్రో సినిమా వలే.. ఓజీ సినిమాకి కూడా కర్త, కర్మ, క్రియ అంతా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే. ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో మహేష్ చాలా పట్టుదలగా ఉన్నారు. నవంబర్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ పెట్టారట సూపర్ స్టార్.

ఎందుకంటే.. డిసెంబర్ నుంచి మహేష్. రాజమౌళితో చేయనున్న మూవీ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. నవంబర్ కి కంప్లీట్ అయినప్పటికీ ఆతర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై కాన్ సన్ ట్రేషన్ చేయాలి. గుంటూరు కారం చేస్తూ ఓజీ పనుల్లో పాల్గొనడం త్రివిక్రమ్ కు కుదరదు. అందుకనే త్రివిక్రమే ఓజీ రిలీజ్ డేట్ ను మార్చాలని చెప్పారని.. దీనికి పవర్ స్టార్ ఓకే చెప్పారని సమాచారం. అదీ.. సంగతి. మరి.. ఈసారైనా పవన్ కు త్రివిక్రమ్ సక్సెస్ అందిస్తాడో లేదో చూడాలి.