నందమూరి నటసింహం బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తే… కూతురుగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తుండడం విశేషం. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో భగవంత్ కేసరి సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది.
అయితే.. భగవంత్ కేసరి అనే టైటిల్ పెట్టడం వెనకు పెద్ద ప్లానే ఉందట. మేటర్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. అందుకనే ఏ టైటిల్ పెడితే బాగుంటుందా అని బాగా ఆలోచించి ఈ టైటిల్ ఫిక్స్ చేశారట. భగవంత్ కేసరి అంటే నార్త్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ టైటిల్ ఖరారు చేశారట. ముందు నుంచి పాన్ ఇండియా ప్లాన్ ఉంది కాబట్టే.. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. పాన్ ఇండియా ప్లాన్ బాగానే ఉంది. మరి.. ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.