రజినీ “కూలీ”లో నాగ్ క్యారెక్టర్ ఏంటి..?

నాగార్జున(Nagarjuna) నా సామి రంగ మూవీతో సంక్రాంతికి వచ్చి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత కుబేర మూవీలో నటిస్తున్నాడు. ఇందులో నాగ్ కోలీవుడ్ స్టార్ ధనుష్ తో కలిసి నటిస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajnikanth) కూలీ(coolee) మూవీలో నాగార్జున నటించనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నాగ్ పుట్టినరోజు సందర్భంగా కూలీ మూవీలో నటిస్తున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

ఇంతకీ విషయం ఏంటంటే.. సెప్టెంబర్ 2 నుంచి కూలీ మూవీ షూటింగ్ లో నాగార్జున జాయిన్ కానున్నారు. వైజాగ్ పోర్ట్ లో షూట్ చేయడానికి ప్లాన్ చేశారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. నాగ్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ నాగ్ విలన్ గా నటించడం.. అది కూడా రజినీ మూవీలో విలన్ గా నటించడం విశేషం. ఈ మూవీలోని నాగ్ క్యారెక్టర్ చాలా మాసీగా, చాలా స్టైలీష్ గా, చాలా డిపరెంట్ గా ఉంటుందట. ఇప్పటికే ఈ మూవీలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు నాగార్జున కూడా నటిస్తుండడంతో మరింత క్రేజ్ పెరిగింది.