బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న మూవీ అఖండ 2. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్ పై విద్యా బాలన్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో విద్యా బాలన్ నటించడం లేదని.. ఆమెకు అఖండ 2తో ఎలాంటి సంబంధం లేదని తెలియచేసింది.
దీంతో విద్యా బాలన్ అఖండ 2లో నటిస్తుందనే వార్త కేవలం గాసిప్ అని తేలిపోయింది. గతంలో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో విద్యాబాలన్ నటించింది. మళ్లీ ఇప్పుడు మరోసారి బాలకృష్ణతో విద్యాబాలన్ అంటూ ప్రచారం జరగడంతో నిజమేనేమో అనుకున్నారు సినీ జనాలు. అయితే.. అందులో వాస్తవం లేదని తేలింది. ఈ మూవీలో సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా మే లేదా జూన్ కు కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్.