మెగాస్టార్ చిరంజీవి క్రేజీ లైనప్ రెడీ చేసుకుంటున్నారు. ఆయన హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ మూవీ రూపొందించబోతున్నారు. దసరా సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ ను సరికొత్త మాస్ యాంగిల్ లో ప్రెజెంట్ చేయనున్నారు. ఈ సినిమాను హీరో నాని నిర్మిస్తుండటం విశేషం. చిరంజీవి శ్రీకాంత్ ఓదెల మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా హిందీ హీరోయిన్ రాణీ ముఖర్జీని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కథానుసారం చిరంజీవి శ్రీకాంత్ ఓదెల మూవీలో మధ్య వయస్కురాలైన హీరోయిన్ కావాలని, ఇందుకోసం రాణీ ముఖర్జీని టీమ్ సంప్రదిస్తున్నారు. ఈ విషయంపై మేకర్స్ అనౌన్స్ మెంట్ చేయనున్నారు.