మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మవీ భోళా శంకర్. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగష్టు 11న విడుదల కానుంది. అయితే.. భోళా శంకర్ మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ప్రకటించలేదు కానీ.. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం, బంగార్రాజు చిత్రాలతో సక్సెస్ సాధించిన కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. చిరు బర్త్ డేకి ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలిసింది.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా మలయాళంలో విజయం సాధించిన బ్రో డాడీ చిత్రానికి రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. బ్రో డాడీలో తండ్రీకొడుకులుగా ఇద్దరు హీరోలుగా మోహన్ లాల్, పృథ్వీరాజ్ నటించారు. అయితే.. తండ్రీకొడుకుల పాత్రలను అన్నదమ్ముల పాత్రలుగా మార్చారట. మరో విషయం ఏంటంటే.. ఇందులో డీజే టిల్లు సిద్దు నటించనున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే.. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. ఆ పాత్రను యంగ్ హీరో శర్వానంద్ తో చేయించనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రచారంలో ఉన్న వార్తల పై క్లారిటీ రావాలంటే ఆగష్టు 22 వరకు ఆగాల్సిందే.