“ది ట్రయల్: షాడో డెట్” ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

పాత్ బ్రేకింగ్ క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ది ట్రయల్ సినిమా. స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు, ఉదయ్ పులిమే, సాక్షి ఉత్తాడ, జస్వంత్ నటించిన ఈ సినిమా గతేడాది థియేటర్స్ లో రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత ప్రైమ్ వీడియోలనూ టాప్ లో ట్రెండ్ అయ్యింది. గ్రిప్పింగ్ థిల్లర్ గా ఆడియెన్స్ ను ఆకట్టుకున్న ఈ సినిమాకు ప్రీక్వెల్ “ది ట్రయల్: షాడో డెట్” అనౌన్స్ చేశారు మేకర్స్. ది ట్రయల్ కథ ముందే జరిగింది అనేది ఈ ప్రీక్వెల్ లో చూపించబోతున్నారు దర్శకుడు రామ్ గన్ని.

కామన్‌మ్యాన్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్ఎస్ ఫిల్మ్స్ బ్యానర్ పై “ది ట్రయల్: షాడో డెట్” చిత్రాన్ని స్మృతి సాగి మరియు శ్రీనివాస్ కె నాయుడు నిర్మించారు. “ది ట్రయల్: షాడో డెట్” సినిమా కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది, 2026 చివరలో విడుదల చేసేందుకు డైరెక్టర్ రామ్ గన్ని ప్లాన్ చేస్తున్నారు.