‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ డేట్ వచ్చేసింది

టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవేటెడ్ మూవీగా ఉంది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ఈ సినిమా మీద ఆడియెన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. జాతి రత్నాలు తర్వాత నవీన్ నటించిన సినిమా కావడం, అటు అనుష్క శెట్టి బ్రేక్ తర్వాత నటిస్తున్న సినిమా అవడంతో ఈ సినిమా మీద క్రేజ్ ఏర్పడింది.

ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి చేసిన స్పెషల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఆగస్టులోనే తెరపైకి రావాల్సిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు కొత్త తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆరోజు, ఆ ముందు రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన వేడుకలు జరుపుకుంటారు. దీంతో ఈ హాలీడేస్ తమ సినిమాకు అడ్వాంటేజ్ అవుతాయని ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీమ్ భావిస్తోంది.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యానర్ లో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్, పాటలు ఆ క్రేజ్ మరింత పెంచాయి. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఓ డిఫరెంట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.