రామ్ చరణ్ సమర్పణలో ప్రారంభమైన ది ఇండియా హౌస్

బీజేపీ (BJP) అధికారంలో ఉన్న గత పదేళ్లు బాలీవుడ్ లో ఆ పార్టీకి సపోర్ట్ గా సినిమాలు వచ్చాయి. వాజ్ పేయి, మోదీ బయోపిక్స్ మొదలు ఎన్నో సినిమాలు వచ్చాయి. బీజేపీకి అనుకూలంగా ఉండే అభిషేక్ అగర్వాల్ (Abhishek agarwal) లాంటి గుజరాత్ బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ నిర్మాతలు తెలుగులోనూ అలాంటి మూవీస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తమ గ్రూప్ లోకి మెల్లిగా రామ్ చరణ్ (Ramcharan) ను కూడా చేర్చుకున్నారు. యూవీ క్రియేషన్స్ విక్రమ్ (Vikram), రామ్ చరణ్ కలిసి వి మెగా పిక్చర్స్ (V mega pictures) అనే బ్యానర్ పెట్టారు.

ఈ బ్యానర్ లో అభిషేక్ అగర్వాల్ (Abhishek agarwal) తో కలిసి ది ఇండియా హౌస్ సినిమా నిర్మిస్తున్నారు. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ (Nikhil siddharth) హీరోగా సయీ మంజ్రేకర్ (Sai Manjrekar) హీరోయిన్ గా నటిస్తోంది. అనుపమ్ ఖేర్ మరో కీ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా తాజాగా కర్ణాటకలోని హంపీలో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వీర్ సావర్కర్ లండన్ లో చదువుకుంటున్నప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఆయనను కొద్ది రోజులు అక్కడి ఇండియా హౌస్ లో ఉంచారు. ఆ ఇండియా హౌస్ నుంచి సావర్కర్ తప్పించుకోవడం ఈ సినిమాకు నేపథ్యంగా ఉండనుంది.