ఈ రెండు మెమొరబుల్ మూవీస్ కి ఫస్ట్ బర్త్ డే

సక్సెస్ ఫుల్ సినిమాలు వస్తుంటాయి. కానీ బడ్జెట్ వైజ్ రిస్క్ చేసి, ఒక భారీ ప్రయత్నం చేసినప్పుడు దక్కే విజయం ఎంతో స్పెషల్ గా మిగిలిపోతుంది. గతేడాది ఆగస్టు 5న రిలీజైన సీతారామం, బింబిసార సినిమాలు ఇలాంటి సక్సెస్ నే దక్కించుకున్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. కరోనా నుంచి అప్పుడప్పుడే ఇండస్ట్రీ కోలుకుంటున్న అనిశ్చిత పరిస్థితుల్లో రిలీజ్ అయ్యి..ప్రేక్షకుల ఆదరణ పొందాయి. సీతారామం, బింబిసార రిలీజై వన్ ఇయర్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో విశెష్ చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు. ఇది తమ సంస్థలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమని ప్రొడక్షన్ హౌసెస్ ట్వీట్ చేస్తున్నాయి.

దుల్కర్, మృణాల్ జోడిగా పీరియాడిక్ లవ్ స్టోరిగా సీతారామంను తెరకెక్కించారు దర్శకుడు హను రాఘవపూడి. సినిమాకు ఎంచుకున్న ఆర్మీ బ్యాక్ డ్రాప్, మేకింగ్ వ్యాల్యూస్, కథలోని ఎమోషన్, క్యారెక్టర్స్ లో నిజాయితీ సినిమాను ప్రేక్షకుల మనసును తాకేలా చేసింది. కథను నమ్మి భారీ బడ్జెట్ పెట్టిన నిర్మాణ సంస్థకు సక్సెస్ ఇచ్చిందీ సినిమా. ఇక బింబిసారతో కల్యాణ్ రామ్ కూడా దాదాపు ఇదే రిస్క్ చేశాడు. రెండు కాలాల మధ్య టైమ్ ట్రావెల్ మూవీగా ఆడియెన్స్ కు డిఫరెంట్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది బింబిసార. సినిమాలో కొత్తదనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కల్యాణ్ రామ్ తో పాటు దర్శకుడు వశిష్ట ఈ సినిమాకు పడిన కష్టం వర్కవుట్ అయ్యింది.