సోహైల్, రూపా కొడవాయుర్ జంటగా మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించిన సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. న్యూ కాన్సెప్ట్ తో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఈ నెల 18న విడుదలవుతోంది.
లేటెస్ట్ ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఈ సినిమాకు ముందు కొందరు పేరున్న హీరోలను అనుకున్నాం. నాని లాంటి హీరోలను ప్రయత్నించినా కుదరలేదు. విశ్వక్ సేన్ కు స్క్రిప్ట్ పంపించాం. సోహెల్ ప్రాజెక్ట్ సెట్ అయ్యేటప్పటికి తను బిగ్ బాస్ కు వెళ్లాడు. ఆ ప్రోగ్రాంలో అతనికి మంచి పేరొచ్చి ఫేమస్ అయ్యాడు దాంతో ఈ కథకు జస్టిఫై చేస్తాడని సోహైల్ తో మూవీ చేశాం. అతను చాలా మంచి పర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. రూపా కొడవయూర్ తెలుగు అమ్మాయి కావడం వల్ల ఎమోషన్స్ చక్కగా పలికించింది. కళ్లతోనే ఎక్స్ ప్రెషన్స్ చూపించింది. ఆమె డాక్టర్ కావడం కూడా ఈ క్యారెక్టర్ కు అడ్వాంటేజ్ అయ్యింది. మేల్ ప్రెగ్నెంట్ అనగానే అందరు వింతగా రియాక్ట్ అవుతారు. ప్రేక్షకులు కూడా అలాగే మొదట సర్ ప్రైజ్ అవుతారు కానీ ఇందులోని ఎమోషన్స్ కు కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం.
మైక్ మూవీస్ ప్రొడ్యూసర్స్ మూవీ మేకింగ్ లో అన్ని విధాలా నాకు సపోర్ట్ చేశారు. మంచి టెక్నీషియన్స్ ను ఇచ్చారు. కథ డిమాండ్ మేరకు ఖర్చు పెట్టారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా చేశామనే పేరొస్తుంది. ఇప్పుడే కాదు పదేళ్ల తర్వాత మా సినిమా చూసినా ఇష్టపడతారు. కాలేజ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రేక్షకులతా మా సినిమాకు కనెక్ట్ అవుతారు. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ తర్వాత హీరో హీరోయిన్ల క్యారెక్టర్ లతో ప్రేక్షకులంతా ట్రావెల్ అవుతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కు గూస్ బంప్స్ వస్తాయి. క్లైమాక్స్ 45 మినిట్స్ సీట్స్ నుంచి కదలకుండా చూస్తారు. అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి చూడాల్సిన సినిమా ఇది. యూఎస్ లో 100 ఫ్లస్ థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది..అన్నారు