‘అది నా పిల్ల..’ మీమ్స్ పై రెస్పాండ్ అయిన దేవరకొండ బ్రదర్స్

అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ చెప్పిన ఆ పిల్ల నాది అనే డైలాగ్ ఫేమస్ అయ్యింది.. ఈ డైలాగ్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. వాళ్లు ఇష్టపడ్డ అమ్మాయిల గురించి ఫ్రెండ్స్ తో ఆ పిల్ల నాది అని చెప్పడం కామన్ అయిపోయింది. ఇక ఈ డైలాగ్ ను రీసెంట్ గా బేబి సినిమాలో చెప్పారు విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ. అయితే ఆయన డిఫరెంట్ స్టైల్ లో, డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్ తో చెప్పారు. విజయ్ డైలాగ్ కు, ఆనంద్ చెప్పిన డైలాగ్ ను పోల్చుతూ సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.

ఆ పిల్ల నాది అనే డైలాగ్ ను కింగ్ సినిమాలో బ్రహ్మానందం సంగీతం మీద చెప్పే ఆకలేస్తే అమ్మ అని ఒకలా పిలుస్తాం అనే ఫన్నీ డైలాగ్ మిక్స్ చేసిన మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ మీమ్స్ పై రీసెంట్ గా స్పందించారు దేవరకొండ హీరోలు. విజయ్ దేవరకొండ స్పందిస్తూ అది నా పిల్ల అనేది ఒక ఎమోషన్ అంటూ రీట్వీట్ చేయగా..ఆనంద్ దేవరకొండ స్పందిస్తూ ట్విట్టర్ అప్పుడప్పుడు ఇలాంటి జెమ్స్ ను విసురుతుంటుంది. అని లాఫింగ్ ఇమోజీస్ పోస్ట్ చేశారు. ఈ ఇద్దరు సోదరుల రీట్వీట్స్ నెటిజన్స్ ను ఆకర్షిస్తున్నాయి.