కొత్త వాళ్లకు ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండదనే ప్రచారంలో నిజం లేదని అన్నారు యువ హీరో ధర్మ. తమ డ్రింకర్ సాయి సినిమా విజయం ద్వారా ఇలాంటి ప్రచారం తప్పని ప్రేక్షకులు, మీడియా మిత్రులు ప్రూవ్ చేశారని ధర్మ చెప్పారు. హీరోగా తనను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ రోజు మీడియా మిత్రుల కోసం డ్రింకర్ సాయి సినిమా స్పెషల్ షో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు మీడియా మిత్రులు హాజరై సినిమా బాగుందంటూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కిరణ్ తిరుమల శెట్టి, నిర్మాత బసవరాజు లహరిధర్, డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
హీరో ధర్మ మాట్లాడుతూ” – డ్రింకర్ సాయి” సినిమాను ఆదరించడం ద్వారా చిత్ర పరిశ్రమలో యువ హీరోగా నాకో స్థానం కల్పించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నాను. కొత్త వాళ్లకు ఇండస్ట్రీలో ప్రోత్సాహం ఉండదు అనేది తప్పని మీరంతా ప్రూవ్ చేశారు. హీరోగా నన్నెంతో ఎంకరేజ్ చేశారు. ఇలాంటి మంచి మూవీ నాతో చేసిన డైరెక్టర్ కిరణ్ గారికి, నిర్మాతలకు థ్యాంక్స్. మీడియా మిత్రులు సినిమా చూసి మీ ప్రశంసలు అందించడం హ్యాపీగా ఉంది. అన్నారు.