శవాలతో పాటు సమస్యల్నీ పూడ్చేసే జాక్ రెడ్డి

మూవీలోని ఒక్కో రోల్ ను రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు “సంతాన ప్రాప్తిరస్తు” మేకర్స్. ఈ క్యారెక్టర్స్ అన్నీ డిఫరెంట్ ఆర్క్ తో ఉండటమే ఈ ఇంట్రెస్ట్ కు కారణం. హీరో హీరోయిన్స్ విక్రాంత్, చాందినీ చౌదరి క్యారెక్టర్స్ నుంచి సాఫ్ట్ వేర్ సుబ్బుగా అభినవ్ గోమటం, డాక్టర్ భ్రమరంగా వెన్నెల కిషోర్, ఇంగ్లీష్ రాని ప్రాజెక్ట్ మేనేజర్ విజ్ఞాన్ కుమార్ గా జీవన్ కుమార్..ఇలా వెరైటీ ఆఫ్ ఫన్, హిలేరియస్ క్యారెక్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ రోజు జాక్ రెడ్డిగా తరుణ్ భాస్కర్ ను పరిచయం చేసింది “సంతాన ప్రాప్తిరస్తు” టీమ్.

డైరెక్టర్, రైటర్ గా టాలెంట్ ప్రూవ్ చేసుకున్న తరుణ్ భాస్కర్..నటుడిగానూ తన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో జాక్ రెడ్డిగా ఆయన నెక్స్ట్ లెవెల్ పర్ ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. తరుణ్ భాస్కర్ కు ఇది నిజంగా కొత్త తరహా క్యారెక్టర్. ఫ్యునెరల్ సర్వీసెస్ అందించే జాక్ రెడ్డికి కాస్ట్ ఫీలింగ్ ఎక్కువే. శవాలతో పాటు సమస్యల్ని కూడా పూడ్చిపెట్టే జాక్ రెడ్డి ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడు అనేది థియేటర్స్ లోనే చూడాలి.