ట్రెండింగ్ లో “తంగలాన్” ట్రైలర్

చియాన్ విక్రమ్ (Chiyaan vikram) తంగలాన్ (Thangalaan) ట్రైలర్ నిన్న రిలీజైంది. ఈ ట్రైలర్ కు అంతటా హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళంలో సోషల్ మీడియాలో తంగలాన్ ట్రైలర్ నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ (Studio green films) సంస్థలో కేఈ జ్ఞానవేల్ రాజా (KE jnanavel raja) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పా రంజిత్ (Pa ranjith) దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన తంగలాన్ సినిమా ట్రైలర్ మరో కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లింది.

ట్రైలర్ లో హీరో విక్రమ్ క్యారెక్టరైజేషన్, యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలుస్తున్నాయి. పార్వతీ తిరువోత్, మాళవిక మోహనన్ క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాంతంలో బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా రా అండ్ రస్టిక్ మేకింగ్ తో దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందించిన తీరు ఆశ్చర్యపరుస్తోంది. ట్రైలర్ ఇన్ స్టంట్ గా హిట్ కావడం, ట్రెండింగ్ అవుతుండటం తంగలాన్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.