రూ.100 కోట్ల వసూళ్లకు చేరువలో “తంగలాన్”

బాక్సాఫీస్ వద్ద తంగలాన్(Thangalaan) వంద కోట్ల రూపాయల వసూళ్లతో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. నేచర్ ను కాపాడుతూనే తన తెగ వారి కోసం పోరాడిన తంగలాన్ వీరుడిని ప్రేక్షకులు ఆదరించారు. తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘన విజయాన్ని అందించారు. తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ 100 కోట్ల రూపాయల మార్క్ చేరువవుతోంది. విక్రమ్(Chiyaan vikram) కెరీర్ లోనే 26 కోట్ల రూపాయలతో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే వసూళ్లు తంగలాన్ కు దక్కాయి.

ఇప్పటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో రన్ అవుతోంది తంగలాన్. రెండో వారంలో “తంగలాన్” సినిమాకు తెలంగాణ, ఏపీలో అదనంగా 141 థియేటర్స్ పెరిగాయి. ఈ సినిమా ఈ నెల 30న హిందీ వెర్షన్ లో నార్త్ అంతటా రిలీజ్ కు రెడీ అవుతోంది. “తంగలాన్” చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్(pa.ranjith) రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్(Studio green) బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.